Breaking News

ప్లేటు పట్టుకుని లైన్‌లో నిల్చోవాలా? తినకుండా వచ్చేస్తా!

Published on Sun, 12/14/2025 - 16:43

పెళ్లి భోజనాలనగానే కొందరు పండగ చేసుకుంటారు. నచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగించవచ్చని ఉబలాటపడతారు. మరికొందరు మాత్రం అంతమందిలో లైను కట్టి మరీ తినడానికి మొహమాటపడతారు. తనకు ఆ మొహమాటం కాస్త ఎక్కువేనంటున్నాడు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌.

నాకంత ఓపిక లేదు
కృతి కర్బందా, పులకిత్‌ సామ్రాట్‌ హోస్ట్‌ చేస్తున్న 'ద మాన్యావర్‌ షాదీ' షోకి తాజాగా కరణ్‌ జోహార్‌ హాజరయ్యాడు. కృతి, పులకిత్‌ పెళ్లి విందు గురించి మాట్లాడారు. ఎంతమంది జనాలున్నా సరే అందరూ తమ వంతు వచ్చేవరకు ఓపికగా నిల్చుకుని భోజనం చేస్తారని పేర్కొన్నారు. ఇంతలో కరణ్‌ కలగజేసుకుటూ తనకు మాత్రం అంత ఓర్పు, సహనం లేదన్నాడు.

భోజనం చేయకుండా వచ్చేస్తా!
పెళ్లిలో నేనెప్పుడూ భోజనం చేయలేదు. భోజనం దగ్గర పెద్ద పెద్ద లైన్లుంటాయి. ఆహారం కోసం ప్లేటు పట్టుకుని అంత పెద్ద క్యూలో నిల్చోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్లకు వెళ్తాను.. కానీ అక్కడ భోజనం చేయకుండానే వెనుదిరుగుతాను అని పేర్కొన్నాడు. అతడి సమాధానం విని కృతి అవాక్కయింది.

సినిమా
ఇకపోతే కరణ్‌ నిర్మించిన తాజా చిత్రం "తూ మేరీ మే తేరా -మే తేరా తు మేరీ". సమీర్‌ విద్వాన్స్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తీక్‌ ఆర్యన్‌, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ గతంలో 'పతీ పత్నీ ఔర్‌ వో' సినిమాలో తొలిసారి జోడీ కట్టారు. ఇప్పుడు రెండోసారి జత కట్టిన ఈ చిత్రం క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.

చదవండి: మౌగ్లీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)