Breaking News

నాన్న వల్ల ఆర్థిక ఇబ్బందులు.. అమ్మ, నాన్నమ్మలే కాపాడారు: కరణ్ జోహార్

Published on Sat, 07/06/2024 - 16:10

కరణ్ జోహార్ సాధించిన ప్రతి విజయం వెనుక తన కృషితోపాటు ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. బాలీవుడ్‌లో రెండున్నర దశాబ్దాలకుపైగా రాణిస్తున్నారు.దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొద్ది కాలంగా దర్శకత్వానికి స్వస్తి పలికి నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న కరణ్‌ తన గతాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాన్న మిగిల్చిన నష్టాలను నాన్నమ్మ తీర్చింది
కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ కూడా టాప్‌ ప్రొడ్యూసర్‌ అని తెలిసిందే. 1980 సమయంలో తన తండ్రి నిర్మించిన 5 సినిమాలు వరుసుగా ఫ్లాప్ కావడంతో తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి తాజాగా కరణ్‌ మాట్లాడాడు. ఇబ్బందుల నుంచి సక్సెస్ కోసం తాను ఎంత కష్టపడ్డారో ఆయన తెలిపారు.

కరణ్ జోహార్ తండ్రి యష్ జోహార్ బాలీవుడ్‌లో దోస్తానా, అగ్నిపథ్, డూప్లికేట్, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలను నిర్మించి టాప్‌ నిర్మాతల లిస్ట్‌లో చేరిపోయారు. అయితే, దోస్తానా (1980) తర్వాత యష్ జోహార్ నిర్మించిన 5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దారుణమైన నష్టాలను మిగిల్చాయి. దీంతో తన నాన్నగారు చాలా ఆస్థులను అమ్మేశారని కరణ్‌ తెలిపారు.

'మా నాన్నగారు  మొదటి చిత్రం ఫ్లాప్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. డబ్బును ఫైనాన్సర్‌లకు తిరిగి చెల్లించడానికి మా నాన్నమ్మ తన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును చెల్లించింది. ఆ తర్వాత మరో సినిమా నిర్మిస్తే అదికూడా నిరాశపరిచింది. ఆప్పుడు మా అమ్మ తన నగలను విక్రయించింది. ఆపై కుటుంబ వారసత్వంగా వస్తున్న ఢిల్లీలోని కొన్ని ఆస్తులను కూడా నాన్న అమ్మేశారు.' అని కరణ్‌ జోహార్‌ గుర్తుచేసు​కున్నారు.

కరణ్ జోహార్ తండ్రి నిర్మాత అయినప్పటికీ, తమది సంపన్న కుటుంబమనే అపోహను తొలగించారు.  వారిది మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి కుటుంబమని చెప్పారు. కుటుంబంలో  ఎన్ని కష్టాలు వచ్చినా రాకుమారుడిలా తనని పెంచారని గుర్తుచేసుకున్నారు.

కరణ్ జోహార్ అంత డబ్బు ఎలా సంపాదించాడు..?
కరణ్ జోహార్ నేడు అత్యంత సంపద కలిగిన నిర్మాతల లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు. తన తండ్రి యష్ జోహార్ డబ్బు సంపాధించకపోయినప్పటికీ మంచిపేరు ఉంది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కరణ్‌ ఊహించలేనంత విజయాలను సొంతం చేసుకున్నారు. కెరీర్‌లో నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి అవిశ్రాంతంగా ఎలా పనిచేశాడో ఆయన తెలిపారు. అదృష్టవశాత్తూ, దర్శకుడిగా తన మొదటి మూడు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయని ఆయన అన్నారు. తన తండ్రి  మరణించిన తర్వాతే  ధర్మ ప్రొడక్షన్స్‌ నుంచి పలు సినిమాలు నిర్మించినట్లు ఆయన అన్నారు.

జీవితంలో తను ఎంత కష్టపడ్డారో కరణ్‌ ఇలా చెప్పుకొచ్చారు. 'మా కుటుంబం ఆనందంగా ఉండాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. కానీ, అంతగా కలిసిరాలేదు. ఆయన కలలకు నేను ఎలాగైనా జీవం పోయాలని అనుకున్నాను. ఈ క్రమంలో నేను ముందుగా దర్శకుడిగా పలు సినిమాలు తీశాను. దేవుడి ఆశీర్వాదంతో అవి సూపర్‌ హిట్‌ అయ్యాయి. చేతిలోకి సరిపడా డబ్బు వచ్చింది. నా కష్టంతో నాన్న కలను నిజం చేశాను. అందుకోసం నేను రోజుకు 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆదివారం,  జాతీయ సెలవు దినాలలో కూడా నేను పని చేస్తాను. నా జీవితంలో శెలవు అనే పదానికి చోటు లేదు.  నేను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతాను.' అని కరణ్‌ చెప్పారు.

దర్శకుడిగా కరణ్ జోహార్ చివరి చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ నటించారు. విమర్శకుల చేత కూడా ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌18 స్టూడీయోస్‌ సంయుక్తంగా నిర్మించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)