Breaking News

ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా

Published on Tue, 09/16/2025 - 18:31

విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన  వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్‌ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్‌ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా  వ్యవహరించారు. 

ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.

తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)