Breaking News

ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్‌ డేట్‌ వచ్చేసింది

Published on Mon, 10/27/2025 - 16:51

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు. అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది. హిందీ భాషలో స్ట్రీమింగ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.

చాప్టర్‌ 1 కథేంటంటే?

'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.

కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ.
 

 

Videos

అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!

భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక

Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి

APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు

డ్రగ్స్ మాఫియాపై ఎటాక్.. 64 మంది మృతి..

Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు

బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..

Jains Nani: ప్రొడ్యూసర్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు

టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ని బయటపెట్టిన శైలజానాథ్

ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు

Photos

+5

తెలంగాణపై మోంథా పంజా.. కుండపోత వర్షాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ ప్రియా వారియర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

వణికించిన మోంథా.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)

+5

నిర్మాత దిల్‌రాజు ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

క్యూట్‌గా కవ్విస్తోన్న జెర్సీ బ్యూటీ (ఫోటోలు)

+5

ఒంటరిగా మాల్దీవులు టూర్‌లో నమ్రత (ఫొటోలు)

+5

నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్‌ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్‌ (ఫొటోలు)

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)