Breaking News

'ఓజీ'ని డామినేట్‌ చేసిన రిషబ్‌శెట్టి

Published on Wed, 09/24/2025 - 11:17

టాలీవుడ్‌లో కేవలం వారం గ్యాప్‌లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 25న పవన్‌ కల్యాణ్‌ ఓజీ, అక్టోబర్‌ 2న రిషబ్‌శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్‌లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్‌లో వ్యూస్‌ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న పవన్‌ కల్యాణ్‌ సినిమా ట్రైలర్‌ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్‌శెట్టి నటించిన కాంతారనే వ్యూస్‌ పరంగా దూసుకుపోతుంది.

ఓజీ తెలుగు ట్రైలర్‌ కేవలం 10 మిలియన్ల వ్యూస్‌ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే,  కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్‌ ట్రైలర్‌ ఏకంగా 15 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్‌శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్‌ చేశారంటూ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్‌ ఉందని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌ సినిమా ట్రైలర్‌కు కేవలం 10 మిలియన్ల వ్యూస్‌ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్‌ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్‌ దాటేసింది.

'హరి హర వీరమల్లు' ట్రైలర్‌కు  48 మిలియన్ల వ్యూస్‌ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్‌ అంటూ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్‌ వ్యూస్‌ కోసం బాట్స్‌ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్‌ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్‌ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్‌కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్‌ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)