Breaking News

'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?

Published on Fri, 10/03/2025 - 16:06

దసరా సందర్భంగా 'కాంతార ఛాప్టర్ 1' థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో దీనికి ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం థియేటర్లలోకి రాలేదు. ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయింది. దానికి తోడు తొలిరోజు దాదాపు అన్నిచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?

విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా 'కాంతార 1' నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు లభించింది. అన్ని చేసినా సరే తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కూడా దాటలేదు.

దేశవ్యాప్తంగా తొలిరోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి రూ.66 కోట్ల వసూళ్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ఓజీ', 'కూలీ' తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుత బాక్సాఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.

'కాంతార' విషయానికొస్తే..  మొదటి పార్ట్‌లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో సరిగ్గా అక్కడి నుంచే 'కాంతార చాప్టర్‌ 1' కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతార అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవిక ప్రదేశముంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతార గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు ఓ బిడ్డ దొరుకుతాడు. అతనికి బెర్మి (రిషబ్‌ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.

అయితే కాంతారలోనే ఉండే బెర్మి.. అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయానా రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడు (జయరామ్‌)తో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది? ఈ స్టోరీలో యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్‌) సంగతేంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)