Breaking News

'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్‌

Published on Fri, 10/10/2025 - 13:22

‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్‌ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ రాబట్టడం విశేషం.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్లు రాబట్టడంతో అభిమానులో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్‌గా విడుదలైన రజనీకాంత్‌ కూలీ సినిమా జీవితకాల కలెక్షన్స్‌ను కూడా కాంతార చాప్టర్‌1 అధిగమించింది. రిషబ్ శెట్టి  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో రోండో స్థానంలో కాంతార చాప్టర్ 1 ఉంది. అయితే, మొదటి స్థానంలో  యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) ఉంది. కానీ, కేజీఎఫ్‌ రికార్డ్‌ను కాంతార చేరుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు. సుమారు రూ. 800 కోట్ల ఫైనల్‌​ కలెక్షన్స్‌తో ఈ మూవీ సత్తా చాటే ఛాన్స్‌ ఉంది. అయితే, కన్నడలో అత్యధికంగా కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌ ఫైవ్‌ చిత్రాలు ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), కాంతార చాప్టర్‌-1 (రూ. 509 కోట్లు), కాంతార (రూ. 450 కోట్లు), కేజీఎఫ్‌ చాప్టర్‌-1 (రూ. 250 కోట్లు), విక్రాంత్‌ రోణా (రూ. 210 కోట్లు) వరుసగా ఉన్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)