Breaking News

Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 06/27/2025 - 07:21

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప(Kannappa ) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో మోహన్‌ బాబు, ప్రభాస్‌, మోహన్‌ లాన్‌, శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 27) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అయింది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కన్నప్ప కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్‌ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్‌ అయ్యాడు? తదితర అంశాలను ఎక్స్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

కన్నప్ప చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా చాలా బాగుందని కొంతమంది, యావరేజ్‌గా ఉందని మరికొంతమంది ట్వీట్‌ చేశారు. మంచు విష్ణు నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ ఫెర్పార్మెన్స్‌ అని కామెంట్‌ చేస్తున్నారు.

 

 మంచు విష్ణు కెరీర్‌లోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌  ఇచ్చారు. ప్రభాస్‌ క్యామియో రోల్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. మోహన్‌ లాల్‌ క్యారెక్టర్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌, నేపథ్య సంగీతం, ఎలివేషన్స్‌ టాప్‌ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్‌ బయటకు వస్తారంటూ ఓ నెటిజన్‌ ఈ సినిమాకు 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. 
 

 

 ప్రభాస్‌ కోసమే ఈ సినిమాకు వెళ్లిపోవచ్చు. ప్రభాస్‌ సీన్స్‌ చాలా బాగున్నాయి. మనం కొన్న టికెట్‌కు ప్రభాస్‌ అతిథి పాత్ర న్యాయం చేస్తుంది అని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

 కన్నప్ప బోర్‌గా సాగే ఓ మైథాలజీ డ్రామా. స్క్రీన్‌ప్లే చప్పగా ఉండడంతో స్టార్టింగ్‌ నుంచి ఎండ్‌ వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఈ స్టోరీ లైప్‌ పేపర్‌పై రాసుకున్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించొచ్చు కానీ తెరపై చూస్తే మాత్రం నిర్జీవంగా, కొన్ని సీన్లు సిల్లీగా అనిపించాయి అంటూ ఓ నెటిజన్‌ కేవలం 2 రేటింగ్‌ మాత్రమే ఇచ్చాడు.

 ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్‌ ఎందుకని సున్నితంగా తప్పుకునే వారు. కానీ ప్రభాస్‌ మాత్రం ఆ రిస్క్‌ చేశాడు. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో మంచి పాత్రని ఎంచుకున్నాడు. అందుకే ప్రభాస్‌ సూపర్‌స్టార్‌ అయ్యాడంటూ ఇంకో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)