నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
కన్నప్ప: పీడించే మారెమ్మగా ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?
Published on Mon, 09/23/2024 - 20:17
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతి సోమవారం క్యారెక్టర్లు రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్ విడుదల చేశారు.
గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్ను రిలీజ్ చేశారు. ఈ రోజు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇప్పటికే కన్నప్ప టీజర్తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Introducing #Aishwarya as #Maremma who is set to unleash wildness in the forests; get ready to experience the force chaos in #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/gpkgux8s6f
— Kannappa The Movie (@kannappamovie) September 23, 2024
Tags : 1