Breaking News

ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా..

Published on Thu, 02/08/2024 - 13:55

థియేటర్లలో సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరప్పా అనేవాళ్లు చాలామందే! అయితే ఓటీటీలో సిరీస్‌లు, సినిమాలు చూస్తే ఆ మజానే వేరనేవారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. అందుకే ఓటీటీల సంఖ్య పెరిగింది. అవి కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలు, కామెడీ షోలు, ఇంటర్వ్యూలు.. ఇలా రకరకాల కంటెట్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌లో వండి వడ్డిస్తున్నాయి.

సంక్రాంతి సినిమాల్లో..
థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొన్ని డిజిటల్‌ ఎంట్రీ గురించి ముందస్తు ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని మాత్రం ఎటువంటి అప్‌డేట్‌ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇకపోతే సంక్రాంతికి వచ్చిన సైంధవ్‌ ఆల్‌రెడీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా గుంటూరు కారం నేటి అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీలో నా సామిరంగ
తాజాగా నా సామిరంగ కూడా డిజిటల్‌ ఎంట్రీకి సిద్ధమైంది. త్వరలోనే నా సామిరంగ రిలీజ్‌ చేయనున్నట్లు హాట్‌స్టార్‌ వీడియో రిలీజ్‌ చేసింది. డేట్‌ మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే కన్నగి అనే తమిళ చిత్రం సైలెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. కాకపోతే తెలుగు వర్షన్‌ మాత్రం ఇంకా అందుబాటులోకి వచ్చినట్లు లేదు.

హారర్‌ మూవీ..
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను హడలెత్తించిన నన్‌ 2 కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ మూవీ ఇదివరకే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఫ్రీగా కాకుండా అద్దెకు తీసుకుని చూడవచ్చని కండీషన్‌ పెట్టింది. ఇప్పుడీ చిత్రం తాజాగా జియో సినిమాలో రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో చూడొచ్చంటూ జియో సినిమా వీడియో షేర్‌ చేసింది. దీంతో హారర్‌ చిత్రాల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2018లో వచ్చిన నన్‌ మూవీకి సీక్వెల్‌గా నన్‌ 2 తెరకెక్కింది.

చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)