Breaking News

కూలీగా మారిన హీరో.. నెట్టింట వీడియో వైరల్‌

Published on Tue, 12/09/2025 - 15:53

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారి పరిస్థితి కూడా అంతే! ఎప్పుడు? ఎలా? ఉంటుందో వారికే తెలియదు. కన్నడ హీరో అభిషేక్‌ హెచ్‌.ఎన్‌. పరిస్థితి కూడా అంతే.. కథానాయకుడిగా బిగ్‌స్క్రీన్‌పై మెప్పించిన ఆయన ఇప్పుడు రోజువాలీ కూలీగా మారాడు. దీని గురించే నేటి ప్రత్యేక కథనం..

తిథి
రామ్‌ రెడ్డి అనే యువకుడు 'తిథి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు కర్మ (తిథి) చేయాలి. తిథి చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులేంటి? అసలు సెంచరీ గౌడ మూడు తరాల వారు ఏం చేస్తున్నారు? ఏంటి? అనేదే కథ.

జాతీయ అవార్డు
పల్లె వాతావరణంలో ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమై పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డు సాధించడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ డైరెక్టర్‌ ద ఫేబుల్‌ (జుగ్నుమా) సినిమా తెరకెక్కించగా ఆ చిత్రానికి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.

కూలీగా మారిన హీరో
ఇకపోతే తిథి మూవీలో హీరోగా నటించిన కన్నడ నటుడు అభిషేక్‌ (Abhishek H. N.) జీవితం మాత్రం ఏమీ మారకపోగా మరింత అద్వాణ్నంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్‌ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు. 

పొట్టకూటి కోసం..
ఇతడు తిథితో పాటు తర్లె విలేజ్‌ (2016), హల్లి పంచాయితీ(2017) అనే సినిమాలు చేశాడు.  మూడు సినిమాల్లో హీరోగా చేసినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశాడు. పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. ఇది చూసిన జనాలు... టాలెంట్‌ ఉన్నవారిని ఎందుకు ఆదరించరు? అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: నేనే దురదృష్టవంతుడిని.. దర్శకుడి ఎమోషనల్‌ పోస్ట్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)