Breaking News

నటి శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోటు స్వాధీనం

Published on Mon, 12/02/2024 - 12:19

కన్నడ సినీ, టీవీ నటి నటి శోభిత శివన్న (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసుల విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో తన భర్తతో  ఆమె ఉంటున్నారు.  డిసెంబర్‌ 1న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్‌ అయ్యారు. అయితే, తాజాగా ఆమె రాసిన ఒక నోట్‌ బయట పడింది.

శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ హబీబుల్లాఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం..  హైదరాబాద్‌ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి మ్యాట్రిమోని ద్వారా శోభిత పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్‌.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. ఆపై  పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది.  శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె నిద్రపోయేందుకు ఓ గదిలోకి వెళ్లింది. 

అయితే, సుధీర్‌ మరో గదిలోకి వెళ్లి డ్యూటీ(వర్క్‌ ఫ్రమ్‌ హోం) చేస్తున్నాడు.  ఉదయం 10 గంటల  అయినా ఆమె డోర్‌ తియకపోవడంతో  శోభిత గది తలుపును పనిమనిషి తట్టింది. ఆమె ఎంతసేపటికీ డోర్‌ ఓపెన్‌ చేయకపోవడంతో.. సుధీర్‌రెడ్డికి విషయం చెప్పి తలుపులు విరగ్గొట్టారు. శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.' పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత   శోభిత మరణానికి కారణాలు తెలుపుతామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)