Breaking News

సీనియర్ నటి, లేడీ విలన్ ఇక లేరు

Published on Mon, 10/05/2026 - 17:44

కన్నడ ప్రముఖ సీనియర్ నటి లలితమ్మ (65) చనిపోయారు. అనారోగ్య కారణాలతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న ఈమె.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఏళ్లుగా నటిగా అలరించిన ఈమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేట్ అయింది వీళ్లేనా?)

దాదాపు 35 ఏళ్లుగా నాటక రంగంతో గుర్తింపు తెచ్చుకున్న లలితమ్మ.. ఎన్నో నాటకాలు, రంగస్థల ప్రదర్శనల్లో నటించారు. అలా టీవీ, సినిమా ఇండస్ట్రీల్లోకి వచ్చారు. ‘రంగోలి’, ‘మాంగల్య’, ‘మహామాయి’ తదితర సీరియల్స్ చేశారు. అయితే స్టార్ దర్శన్ ‘సుందర గాలి’లో ఈమె చేసిన లేడీ విలన్ సరాయి శారదే పాత్ర స్టార్‌డమ్ వచ్చేలా చేసింది.

ఈ సినిమా తర్వాత ‘జంగ్లీ’, ‘లైఫు ఇష్టేనే’, ‘వజ్రకాయ’, ‘పుత్ర’, ‘జాకీ’ తదితర కన్నడ సినిమాల్లో లలితమ్మ నటించారు. ఎక్కువగా సహాయ పాత్రల్లో కనిపించినప్పటికీ.. తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.

ఇకపోతే లలితమ్మ గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండున్నర నెలల క్రితం స్ట్రోక్ కూడా వచ్చింది. అప్పటి నుంచి బెంగళూరులోని ఓ ట్రస్ట్‌లో చికిత్స తీసుకుంటూ వచ్చారు. అలాంటి ఈమె ఇప్పుడు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

(ఇదీ చదవండి: 'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ రిలీజ్)

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)