Breaking News

అలనాటి స్టార్ హీరోయిన్ కూతురి పెళ్లి.. చిరంజీవి సినిమాలో కూడా!

Published on Mon, 02/10/2025 - 16:47

కన్నడ సినీ ఇండస్ట్రీలో జయమాల అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు కన్నడతో పాటు తెలుగు, తుళు, తమిళ భాషల్లో కూడా హీరోయిన్‌గా అభిమానులను మెప్పించింది. దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన జయమాల పెరిగింది మాత్రం చిక్‌మంగళూరు జిల్లాలోనే. ఆమె కాస్ దాయె కండన అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత నటిగా ఫేమ్ తెచ్చుకున్న ఆమె కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, లోకేష్, శంకర్ నాగ్, అనంతనాగ్, శివరాజకుమార్, రాఘవేంద్ర రాజకుమార్, టైగర్ ప్రభాకర్(తెలుగు నాట కన్నడ ప్రభాకర్‌గా పాపులర్) వంటి సుప్రసిద్ధ కన్నడ స్టార్ హీరోల సరసన నటించింది.

తాజాగా ఆమె కూతురు సౌందర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి పలువురు కన్నడ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. కిచ్చా సుదీప్‌,  కేజీఎఫ్ హీరో యశ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

k

చిరంజీవితో జయమాల..

కాగా.. తెలుగులో జయమాల అర్జున గర్వభంగం (1979), భామా రుక్మిణి (1983), రాక్షసుడు (1986)(చిరంజీవి) చిత్రాల్లో నటించింది. రాక్షసుడు చిత్రంతో ఈమె తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలసి  "నీ మీద నాకు ఇదయ్యో...అందం నే దాచలేను పదయ్యో.." అనే పాటతో మెప్పించింది. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో చిరంజీవితో పాటు తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి నిర్మాత కె.ఎస్ రామారావు నిర్మించగా.. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.

ja

కాగా.. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్‌ను వివాహం చేసుకుంది.  అనేక తెలుగు చిత్రాల్లో విలన్‌గా బాగా పాపులరిటీ తెచ్చుకున్నారు. రాక్షసుడు చిత్రంలో కూడా ప్రధాన విలన్‌గా నటించడం విశేషం. అయితే కొన్ని కారణాల రీత్యా జయమాల అతడికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామెన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లాడింది. వీరిద్దరికి సౌందర్య అనే కుమార్తె ఉంది. తాజాగా తన కూతురి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించింది జయమాల.
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)