Breaking News

Kanguva Review: ‘కంగువా’ ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 11/14/2024 - 06:44

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ పీయాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌లో దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రలో పోషించారు.  ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

కంగువా కథేంటి? ఎలా ఉంది? సూర్య ఖాతాలో భారీ హిట్‌ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.

ఎక్స్‌లో కంగువా చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. సూర్య యాక్టింగ్‌ అదిరిపోయిందని అంటున్నారు. శివ టేకింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే ఇది యావరేజ్‌ మూవీ అంటున్నారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, వీఎఫ్ఎక్స్ బాగున్నాయని చెబుతున్నారు.  ఇక విలన్‌ పాత్రలో బాబీ డియోల్ అదరగొట్టేశాడని కామెంట్‌ చేస్తున్నారు. 

కంగువా బ్లాక్‌ బస్టర్‌ మూవీ. సూర్య, బాబీ డియోల్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ ఫిల్మ్‌. దిశా పటానీ లుక్‌ హాట్‌గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్‌ బీజీఎం అదరగొట్టేశాడు. వీఎఫ్‌ఎక్స్‌, విజువల్స్‌ చాలా బాగున్నాయి’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

 

 స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా ఉంది. సూర్య తన నటన అదిరిపోయింది. ఫేస్‌ ఆఫ్‌ సీన్స్‌ బాగున్నాయి. కంగువా 2 కోసం ఆగలేకపోతున్నాం. బాబీడియోల్‌ ఎప్పటిమాదిరే తనదైన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ బాగుంది’అంటూ ఓ నెటిజన్‌ 4.25/5 రేటింగ్‌ ఇచ్చాడు.

 కంగువా ఓ యావరేజ్‌ ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌. కథ బాగున్నా..తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. సూర్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాకు కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా కథంతా యావరేజ్‌. ఎమోషనల్‌ మిస్‌ అయింది. డైరెక్టర్‌ శివ ఫస్టాఫ్‌ స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్‌లో తడబడ్డాడు. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది.మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది. ప్రొడక్షన్స్‌ వాల్యూస్‌ బాగున్నాయి’అంటూ ఓ నెటిజన్‌ 2.25 రేటింగ్‌ ఇచ్చాడు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)