Breaking News

సూర్య కంగువా.. తగ్గించినా లాభం లేదు.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published on Wed, 11/20/2024 - 13:30

కోలీవుడ్ స్టార్‌ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్‌ సినిమాపై పడింది. తొలిరోజు సూర్య కెరీర్‌లోనే ది బెస్ట్‌ వసూళ్లు రాబట్టినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. దీంతో రిలీజైన ఆరు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించింది.

మొదటి రోజు రూ. 24 కోట్లు రాబట్టిన కంగువా ఆ తర్వాత వీకెండ్‌లోనూ పెద్దగా రాణించలేకపోయింది. నవంబర్ 19న కేవలం రూ.3.15 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండో వారంలోనైనా పుంజుకుంటుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది.

12 నిమిషాల తగ్గింపు

కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతున్న ఈ మూవీ నిడివిని తగ్గించారు. దాదాపు 12 నిమిషాల సీన్స్ కట్‌ చేసినట్లు ప్రకటించారు. ట్రిమ్ చేసిన కంగువ వర్షన్ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడైనా ఫ్యాన్స్‌ నుంచి కంగువాకు ఆదరణ దక్కుతుందేమో వేచి చూడాల్సింది. కాగా.. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ లెక్కన చూస్తే బిగ్ డిజాస్టర్ ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)