Breaking News

కోట్ల ఆస్తిని అమ్మకానికి పెట్టిన హీరోయిన్‌..!

Published on Sun, 08/04/2024 - 15:23

బాలీవుడ్ భామ, నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 6న వెండితెరపైకి రానుంది. కంగనా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.

తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త బీ టౌన్‌లో వైరల్‌గా మారింది.  ముంబయిలోని తన ఇంటిని అమ్మకాని పెట్టారని టాక్ వినిపిస్తోంది. అందులోనే కంగనా నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం కూడా ఉంది. బాంద్రాలో దాదాపు 3,042 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రెండు అంతస్తుల భవనం అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీటి ధరను రూ. 40 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కంగనా అధికారికంగా వెల్లడించలేదు.

అయితే గతంలో సెప్టెంబర్ 2020లో  గ్రేటర్ ముంబయి అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత కంగనా కేసు దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు  స్టే విధించింది. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కావాలనే నన్ను టార్గెట్ చేశారని కంగనా ఆరోపించింది. అప్పట్లో రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఆ తర్వాత మే 2023లో కంగనాపై అభియోగాలను బీఎంసీ ఉపసంహరించుకుంది.
 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)