Breaking News

ఎయిర్‌పోర్ట్‌లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!

Published on Thu, 06/06/2024 - 18:45

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్‌ మహిళ కానిస్టేబుల్‌ దాడికి పాల్పడింది. చండీఘర్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్‌ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్‌ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కుల్వీందర్‌ కౌర్‌గా గుర్తించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)