Breaking News

నేను చాలా సెల్ఫిష్‌.. ప్రజల కోసం జీవితం త్యాగం చేయలేను: కంగనా

Published on Wed, 07/09/2025 - 13:56

సామాన్యులకు సేవ చేయడం కోసం రంగుల ప్రపంచాన్ని కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిన తారలు ఎంతోమంది. అందులో సక్సెస్‌ అయినవారు కొందరైతే విఫలమైన వారు మరికొందరు! కానీ, బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. ప్రజల కోసం పనిచేస్తానంటూ బింకాలు పలికారు. కానీ, ఏడాది తిరిగేసరికి రాజకీయ జీవితమే విసుగొచ్చిందంటున్నారు.

ఈ పంచాయితీ ఏంది?
కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. రాజకీయ జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నేను మహిళల హక్కుల కోసం పోరాడాను, కానీ ప్రజలకు సేవ చేయాలని ఎన్నడూ అనుకోలేదు. కొందరు నాలా ధ్వంసమైందని నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు. పంచాయతీ స్థాయిలోని సమస్యలను నా ముందు ఏకరువు పెడతారు. 

PM పదవి కోసం పోటీ?
నేను ఎంపీనన్న విషయమే లెక్క చేయరు. రోడ్లు బాలేకపోయినా నాకే చెప్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నా సరే.. నీ దగ్గర డబ్బులున్నాయిగా.. వాటితో బాగు చేయించమని డిమాండ్‌ చేస్తారు. రాజకీయంలో ఇంకా ముందుకు వెళ్లాలనైతే నేను అనుకోవడం లేదు. ప్రధానమంత్రి పదవికి పోటీపడేంత సమర్థురాలిని కాను. ఆ పోస్ట్‌ కోసం పోటీపడేంత అర్హత లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. 

నేను సెల్ఫిష్‌
సామాజిక సేవ అనేది నా లైఫ్‌లో లేదు. నేను చాలా సెల్ఫిష్‌ జీవితాన్ని గడిపాను. పెద్ద ఇల్లు, మంచి కారు, వజ్రాల ఆభరణాలు ఉండాలనుకున్నాను. అందంగా కనిపించాలనుకునేదాన్ని. నేను కోరుకున్నట్లే బతికాను. కానీ, దేవుడు నన్ను ఇటువైపు ఎందుకు నడిపించాడో తెలియడం లేదు. నా జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయలేను. పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేసే జీవితం నాకిష్టం లేదు. అలా జరగాలని కూడా నేను కోరుకోను అని కంగనా చెప్పుకొచ్చారు.

సినిమా
కంగనా.. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌.. మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఏక్‌ నిరంజన్‌ మూవీలో హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన ఆమె చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో కంగనా నటించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోంది.

చదవండి: అమెరికాలో ప్రియుడితో సమంత చెట్టాపట్టాల్‌?!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)