Breaking News

ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రెహమాన్‌పై కంగనా ఫైర్‌

Published on Sun, 01/18/2026 - 12:21

లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ చేసిన మతపర వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన మతం వల్లే ఎనిమిదేళ్లుగా అవకాశాలు రాలేదంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రెహమాన్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది హీరోయిన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌.

మీలాంటి మనిషిని చూడలే
ఈ మేరకు కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ షేర్‌ చేసింది. ప్రియమైన ఏర్‌ రెహమాన్‌..  నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు ఇండస్ట్రీలో నాపై ఎంతో వివక్ష చూపించారు. కానీ, మీకంటే ఎక్కువ పక్షపాతం, ద్వేషం చూపించిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు. నేను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాకు సంగీతం అందించమని కోరేందుకు మిమ్మల్ని సంప్రదించాలని ప్రయత్నించాను. కనీసం కథ చెప్పే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు. 

ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి
నా సినిమా ఒక ప్రొపగాండా అన్న భావనతో మీరు దానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఎమర్జెన్సీ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా నన్ను అభినందిస్తూ లేఖలు పంపారు. కానీ మీకు మాత్రం ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి అని మండిపడింది. ఇదే క్రమంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తాపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

చీరలో వెళ్లేందుకు నో
తన బ్రాండ్‌ ప్రమోషన్స్‌ కోసం నన్ను వాడుకుంది. కానీ, ఓ రోజు అయోధ్య రామజన్మభూమికి వెళ్లేటప్పుడు మాత్రం తన చీర ఇచ్చేందుకు మసాబా నిరాకరించింది. అప్పుడు అవమానభారంతో కారులోనే ఏడ్చేశాను. ఓపక్క వీళ్లే ఇలా చేస్తుంటే ఏఆర్‌ రెహమాన్‌ మాత్రం మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు అని కంగనా మండిపడింది.

చదవండి: ఒక్కడు మూవీలో ఆ ఫోన్‌ నెంబర్‌ ఎవరిదో తెలుసా?

Videos

TDP నేతల చేతిలో చంపబడ్డ మంద సాల్మన్ కొడుకుల సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్

వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు

నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్

అపాయింట్ మెంట్ కోరుతూ ఏపీ డీజీపీకి MLC లేళ్ల అప్పిరెడ్డి లేఖ

సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ

హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..

ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్

మహిళ డ్యాన్సర్లతో మంత్రి వాసంశెట్టి డాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో

లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ

Photos

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా, శర్వానంద్‌ (ఫోటోలు)

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)