Breaking News

అలా చేయడం నచ్చలేదు.. అందుకే తెలుగు సినిమాల నుంచి తప్పుకున్నా!

Published on Thu, 08/28/2025 - 17:59

ఆనంద్‌ మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కమలినీ ముఖర్జీ. స్టైల్‌, గోదావరి, గమ్యం, గోపి గోపిక గోదావరి.. ఇలా పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. చివరగా తెలుగులో గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రెండు పరభాషా చిత్రాలు చేసిన ఆమె 2016 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

విభిన్న పాత్రల్లో..
తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తెలుగులో నేను అన్ని రకాల ఎమోషన్స్‌ ఉండే అమ్మాయిగా నటించాను. చాలా సినిమాల్లో నేను అమ్మానాన్న లేని అనాథగానే కనిపించాను. బలమైన స్త్రీ పాత్రలు చేశాను. అదే సమయంలో చాలా సున్నితమైన అమ్మాయిగానూ కనిపించాను. కానీ, రానురాను అలాంటి బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్‌లో రాలేదు.

అందుకే వెనకడుగు వేశా..
గోవిందుడు అందరివాడేలే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లేదనిపించింది. మూవీ పూర్తయ్యాక నేను పోషించిన పాత్ర చూసుకుని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను కూడా! దానికోసం నేను గొడవపడాలని, రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే.. గోవిందుడు అందరివాడేలే తర్వాత తెలుగు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుని టాలీవుడ్‌కు దూరంగా ఉన్నాను. అలా అని నాకు ఎవరిపైనా కోపం లేదు.

టాలీవుడ్‌ నుంచి తప్పుకున్నా..
సినిమాలో చాలా జరుగుతుంటాయి. దర్శకుడు ఓ సీన్‌ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో, బాగోలేదనో దాన్ని ఎడిటింగ్‌లో తీసేస్తుంటారు. ఆ విషయాన్ని మాకు చెప్పరు. ఒక మాటైనా చెప్పకుండా మన సీన్‌, డైలాగులు తీసేస్తే బాధనిపిస్తుంది. దాన్ని నేను లైట్‌ తీసుకోలేను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకుని ఇతర భాషల్లో చేశాను.

పెళ్లి
మలయాళ మూవీ పులి మురుగన్‌(2016) తర్వాత నాకు పెళ్లయింది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. చిన్నప్పుడు చదువుకే కేటాయించాను. పెద్దయ్యాక సినిమాలు చేశాను. ఇప్పుడు భార్యగా కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను అని కమలినీ ముఖర్జీ చెప్పుకొచ్చింది.

చదవండి: అఫీషియల్‌: వచ్చేవారమే బిగ్‌బాస్‌ 9 ప్రారంభం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)