Breaking News

'థగ్‌లైఫ్‌' కమల్‌ దెబ్బ.. జన నాయకన్‌ విజయ్‌కి తగిలింది

Published on Wed, 06/04/2025 - 19:45

ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్‌కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్‌ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్‌లైఫ్‌ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్‌లైఫ్‌ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్‌ నటించిన చివరి సినిమా 'జన నాయకన్‌', ఇప్పుడు 'థగ్‌ లైఫ్‌' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్‌ ప్రొడక్షన్స్ కావడమే.

వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్‌ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్‌ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే వీరి ప్లాన్స్‌ను థగ్‌లైఫ్‌ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్‌ లైఫ్‌ని బ్యాన్‌ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్‌ జననాయకన్‌' అనే కొత్త క్యాంపెయిన్‌ మొదలైంది.

థగ్‌ లైఫ్‌ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్‌ తన జననాయకన్‌ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్‌ వేదికగా రాజేష్‌ లింగేష్‌ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్‌ కూడా బ్యాన్‌ చేయాలి అంటూ పోస్ట్‌లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్‌ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.

దీంతో విజయ్‌ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్‌కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్‌ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు  సినిమా నిషేధించడం న్యాయం కాదు.  జననాయకన్‌ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్‌ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్‌లైఫ్‌.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్‌ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)