Breaking News

వయనాడ్‌ కోసం కమల్‌ హాసన్‌ భారీ విరాళం

Published on Sat, 08/03/2024 - 09:20

కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జులై 29 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మఖ్యంగా వయనాడ్‌ ప్రాంత ప్రజలు భారీగ నష్టపోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలు చిత్ర పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్‌ సాయం చేసి అండగా నిలిచారు. అయితే, తాజాగా తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కూడా భారీ విరాళం అందించారు.

మక్కల్‌ నీది మయ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ సినిమాలతో పాటు సామాజిక అంశాలపై తన నిబద్ధతను  ప్రదర్శింస్తారు. భారీ వర్షాల వల్ల వయనాడ్‌ ప్రజలు తీరని కష్టాలను ఎదుర్కొంటుకున్నారు. వారిని ఆదుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించారు. చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా ఈ ఘటన మిగిలిపోతుందని ఆయన కామెంట్‌ చేశారు. 

చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో సుమారు 320 మందికి పైగా మరణించారు. 250 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రాణాలతో బయటపడినవారి కోసం వెతకడానికి డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను అక్కడి ప్రభుత్వం అనుసరిస్తుంది.

కమల్ హాసన్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో గతం నుంచే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కమల్ హాసన్ చేసిన విరాళం చాలా ముఖ్యమైనది.  ఆయనతో బలమైన బంధాన్ని పంచుకున్నారు. వారిద్దరూ కూడా  అనేక సందర్భాల్లో భేటీ అయిన విషయం తెలిసిందే. 
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు