Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
ఆరాధన గుర్తుండిపోతుంది: కామాక్షీ భాస్కర్ల
Published on Sun, 11/16/2025 - 03:45
‘‘మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రూపోందిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌గారికి జోడీగా ఆరాధన అనే పాత్ర చేశాను. నా పాత్ర ఎక్కడ నుంచి వచ్చింది? ఏం చేస్తుంది? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ చిత్రకథ లేదు. సినిమా చూసిన తర్వాత ఆరాధన అందరికీ గుర్తుండిపోతుంది’’ అని కామాక్షీ భాస్కర్ల తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పోలిమేర’ మూవీ ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కామాక్షీ భాస్కర్ల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘పోలిమేర’ తర్వాత అనిల్ విశ్వనాథ్‌గారు కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు. అందుకే ‘12ఏ రైల్వే కాలనీ’కి దర్శకత్వం వహించకుండా తన పర్యవేక్షణలో నానిగారితో దర్శకత్వం చేయించారు. నానిగారు అద్భుతంగా తీశారు. నేను జనరల్ ఫిజీషియన్‌ని. నేను పని చేస్తున్న సినిమా సెట్‌లో నన్ను డాక్టర్‌గానూ యూజ్ చేస్తుంటారు (నవ్వుతూ).
ఇండియన్ సినిమాలో పారామెడికల్ కల్చర్ తక్కువ... ఈ సంస్కృతిని తెలుగు సినిమాలోనూ తీసుకురావాలనే ఆలోచన ఉంది. శ్రీవిష్ణు, సుహాస్, విజయ్ సేతుపతిగార్లు హీరోలుగా, అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. అయితే ఫీమేల్ యాక్ట్రెస్‌కి ఆ యాక్సెప్టెన్సీ లేదు. అలా ఎందుకు ఉండకూడదని సవాల్‌గా తీసుకుని హీరోయిన్‌గా చేస్తూనే కీలక పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నాను. ‘పోలిమేర 3’ షూటింగ్ ఆరంభం కావాలి. మరో పెద్ద సినిమా కూడా ఒప్పుకున్నాను’’ అని చెప్పారు.
Tags : 1