Breaking News

హిట్‌ కోసం నిరీక్షణ.. ఈసారైనా అమ్మడి కల నెరవేరేనా?

Published on Mon, 07/17/2023 - 12:14

సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న నటీమణుల్లో కల్యాణి ప్రియదర్శన్‌ ఒకరు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీల వారసురాలైన ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. అయితే ఇప్పటికీ కెరియర్లో సరైన హిట్టు పడలేదు అన్నది వాస్తవం. తరువాత తెలుగులో హలో అంటూ పలకరించిన కల్యాణి ప్రియదర్శన్‌ ఇక్కడ వరుసగా మూడు చిత్రాలు చేశారు. తొలి చిత్రం హలో నిరాశ పరిచినా, చిత్ర లహరి సినిమా విజయం సాధించింది. అయితే అది నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఖాతాలోనే పడింది. ఇక మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ.. మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

తమిళం విషయానికి వస్తే హీరో చిత్రంతో రంగప్రవేశం చేశారు. ఆ తరువాత పుత్రం పొందు కాళై, మానాడు తదితర చిత్రాల్లో నటించారు. శింబు సరసన నటించిన మానాడు చిత్రం విజయం సాధించినప్పటికీ కళ్యాణి ప్రియదర్శన్‌కి పెద్దగా క్రేజీ తీసుకు రాలేదు. అలాంటిది తాజాగా జయం రవి సరసన జీనీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి, వామిక గబ్బీ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని కల్యాణి ప్రియదర్శిన్‌ వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో నటించడం చాలా ఎక్జయిటింగ్‌ గా ఉందని పేర్కొన్నారు. ఇది తన కెరీర్లో చాలా విలువైన చిత్రంగా మిగిలిపోతుందని నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌ కథతో రూపొందుతున్న చిత్రమని చెప్పారు. ఇందులో తనది నటించడానికి అవకాశం ఉన్న పాత్ర అని, జీని మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

చదవండి: ప్రెగ్నెన్సీతో పోకిరి భామ.. ఎట్టకేలకు ప్రియుడిని చూపించింది

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు