Breaking News

ఎంత ప్రేమించానో తెలుసా?: హీరోయిన్‌ ఎమోషనల్‌

Published on Mon, 10/07/2024 - 17:35

హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌ పుట్టెడు దుఃఖంలో ఉంది. పెంపుడు శునకం చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడలేకపోతోంది. పెట్‌ డాగ్‌తో ఆడుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయింది. 'థియో.. ఈ వారమే నన్ను వదిలేసి వెళ్లిపోయింది. తన మరణవార్త నా గుండెను ముక్కలు చేసింది. చూడటానికి చిన్నగా ఉన్నా దానికి ఎంతో ఎనర్జీ ఉండేది. 

తన ఇంట్లోనే మేమున్నాం..
మేము దాన్ని ఇంటి యజమాని అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఇది తనిల్లు.. తన ఇంట్లోనే మేము నివసిస్తున్నాం. అదొక సిల్లీ వాచ్‌డాగ్‌ కూడా! స్టూడియో బయట కూర్చోవడం దానికెంతో ఇష్టం. ప్రతి వేసవిలో దానికి హెయిర్‌ కట్‌ చేసేవాళ్లం. దానితో చివరిసారి ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుని ప్రేమగా ముద్దుపెట్టుకోవాల్సింది. దానిపై ప్రేమ కురిపించిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

ఎంతో ప్రేమించా..
అలాగే అది లేదన్న నిజం తట్టుకోలేక డీలా పడిపోయిన నన్ను ఓదార్చి ధైర్యంచెప్పినవారికి కూడా థాంక్స్‌​. థియో.. గత కొన్నేళ్లుగా నీతో నేను ఎక్కువ టైం స్పెండ్‌ చేయలేకపోయాను. కానీ నువ్వు చాలా మంచి అబ్బాయివి. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించానో అర్థం చేసుకో.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు థియోతో కలిసున్న ఫోటోలు జత చేసింది.

కాగా కల్యాణి ప్రియదర్శన్ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)