Breaking News

దుల్కర్‌తో వన్స్‌మోర్‌ అంటున్న హీరోయిన్‌!

Published on Thu, 08/17/2023 - 12:10

మాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వారసుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు దుల్కర్‌ సల్మాన్‌. తక్కువకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. మాతృభాష మలయాళంలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటుతున్నాడు.

తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్‌ కణ్మణి, హే అనామికా వంటి కొత్త తరహా కథా చిత్రాల్లో నటించి అలరించాడు. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు కోలి అనే టైటిల్‌ను నిర్ణయించారు.

అట్లీ శిష్యుడు కార్తీకేయన్‌ వేలప్పన్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ నటించనున్నట్లు తెలిసింది. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని జీ.స్టూడియోస్‌ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా మానాడు చిత్రంలో శింబు సరసన నటించిన కల్యాణి ప్రియదర్శన్‌ తాజాగా కోలీ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దుల్కర్‌, కల్యాణి ఇద్దరూ గతంలో వరనే అవశ్యముంద్(తెలుగులో పరిణయం) సినిమాలో నటించారు.

చదవండి: ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)