Breaking News

కల్యాణ్‌ పీక పట్టుకున్న పవన్‌.. 'రీతూ' వల్ల సేఫ్‌

Published on Fri, 11/28/2025 - 23:26

బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కల్యాణ్-పవన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అదే సమయంలో రీతూపై సంజన చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి.  ఈ వారం నామినేషన్‌లో కల్యాణ్‌ అయితే పూర్తిగా కంట్రోల్‌ తప్పి రీతూపై రెచ్చిపోయాడు. తను  అమ్మాయి అనే సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కల్యాణ్‌ను ఆపేందుకు  డీమాన్ పవన్‌ మధ్యలో రావడంతో పరిస్థితి మరింత పెద్దదైంది.

కల్యాణ్‌, డీమాన్‌ పవన్‌ల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో కల్యాణ్‌ పీకని డీమాన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు.  ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్‌లో నాగార్జున  ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  కల్యాణ్‌ పీకని డీమాన్ పట్టుకున్న ఘటన గురించి సంజన పదేపదే హౌస్‌లో తీసుకొస్తుంది. దీంతో పవన్‌కు ఎక్కువ బ్యాడ్‌ నేమ్‌ రావచ్చని మరుసటిరోజు రీతూ జోక్యం చేసుకుంది.

గొడవ కల్యాణ్‌తో జరిగింది కాబట్టి అతనితోనే రీతూ మాట్లాడింది. 'అసలు డీమాన్‌ ఏం చేశాడు నీ దగ్గరకు వచ్చి అంటూ కల్యాణ్‌ను రీతూ ప్రశ్నించింది. దీంతో కల్యాణ్‌ కూడా ఇలా సమాధానం చెప్పాడు. 'గొడవ జరిగిన సమయంలో వాడు నా పీక పట్టుకున్నాడని చెబుతున్నారు.' అని తెలిపాడు. దానికి రీతూ కూడా ఇలా చెప్పింది. వాడి ఎమోషన్‌ గురించి నీతో పాటు హౌస్‌లో ఉన్న వారందరికీ తెలుసు.  జరిగిన గొడవలో నీ మీద వాడికి (డీమాన్‌) కోపం లేదు.  నిన్ను ఆపేందుకే మాత్రమే వాడు వచ్చాడు. అనుకోకుండా జరిగిన విషయాన్ని సంజన చెడుగా చూపుతూ మాట్లాడుతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు.  వాడిని ఇలా ఎన్నిసార్లు తొక్కేస్తారు రా..' అంటూ రీతూ బాధపడుతుంది. అయితే, కల్యాణ్‌ కూడా డీమాన్‌కు అండగా మాట్లాడాడు. వీకెండ్‌లో నాగార్జున గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ ఏం జరగలేదని చెబుతానంటూ వెళ్లిపోయాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)