Breaking News

ప్రభాస్ కల్కి మూవీ.. ఈ పోస్ట్‌ చూస్తే చాలు.. ఆయన ఎంత కష్టపడ్డాడో!

Published on Thu, 06/27/2024 - 21:04

ప్రభాస్- నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌, విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. అభిమానుల ‍భారీ అంచనాల మధ్య గురువారం రిలీజైంది. ఉదయం నుంచే ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ సందడి మొదలైంది. మొదటి రోజే కల్కి సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

అయితే కల్కి సినిమాకు తెరెకెక్కించేందుకు దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు. ఇప్పటికే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని.. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని మేకర్స్‌ విజ్ఞప్తి చేశారు. అయితే డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం తాను కష్టపడ్డాడో అది చూస్తేనే అర్థమవుతోంది.

తాజాగా తన అరిగిపోయిన చెప్పులను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ఇది ఒక సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. కాగా.. కల్కి చిత్రంలో అగ్రతారలైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి స్టార్స్ నటించారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)