Breaking News

ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్

Published on Tue, 03/18/2025 - 17:07

నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ద్వారానే నాగ్ అశ్విన్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ విడుదలైన పదేళ్లు పూర్తి కావడంతో మరోసారి బిగ్‌ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు.

ఇలాంటి అరుదైన సినిమాలు తరచుగా రావని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. మీలో ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే తప్పుకుండా థియేటర్లకు వెళ్లి చూడాలని అభిమానులను కోరారు. నేటి యువతరం తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఎవడే సుబ్రమణ్యం ఒకటని ఆయన తెలిపారు. ఈ జనరేషన్‌కు మూవీ కథ సరిగ్గా సెట్ అవుతుందన్నారు. గత పదేళ్లలో చాలా చిత్రాలు వచ్చాయి.. కానీ ఆ టైమ్‌లో చూడని వాళ్లు ఎవరైనా ఉంటే చూడాలని కోరారు. ఈ సినిమా చూసి కనీసం ఒకశాతం మార్పు వచ్చినా చాలని నాగ్ అశ్విన్ వీడియోను రిలీజ్‌ చేశారు.

కాగా.. ఎవడే సుబ్రమణ్యం మూవీ ఈనెల 21న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం ఎవరైనా మిస్సయితే ఎంచక్కా బిగ్‌ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయండి.
 

 

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)