కొండేపిలో నూతన YSRCP ఆఫీస్ ప్రారంభం
Breaking News
టాలీవుడ్ నుంచి కల్కి మూవీ.. ప్రతిష్టాత్మక నామినేషన్స్‌లో చోటు!
Published on Mon, 07/14/2025 - 19:11
టాలీవుడ్ మూవీ కల్కి 2898 ఏడీ చిత్రం సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ నామినేషన్స్లో చోటు దక్కించుకుంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచింది. ఈ విభాగంలో హోమ్బౌండ్, ఎల్2 ఎంపురాన్, మహారాజ్, స్త్రీ-2, సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్ సినిమాలతో పోటీ పడనుంది.
అంతేకాకుండా ఉత్తమ నటుడు విభాగంలో మోహన్‌లాల్ (ఎల్2 ఎంపురాన్), అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), ఆదర్శ్ గౌరవ్ (సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలేగావ్), ఇషాన్ ఖట్టర్ (హోమ్‌బౌండ్), విశాల్ జెత్వా (హోమ్‌బౌండ్), జునైద్ ఖాన్ (మహారాజ్) పోటీలో నిలిచారు. ఉత్తమ నటి విభాగంలో అంజలీ శివరామన్ (బ్యాడ్‌గర్ల్), భనితా దాస్ (విలేజ్ రాక్‌స్టార్స్ 2), కరీనా కపూర్ (ది బకింగహామ్ మర్డర్స్), శ్రద్దా కపూర్ (స్త్రీ -2), తిలోత్తమ షోమ్ (షాడోబాక్స్) పోటీ పడుతున్నారు.
వీటితో పాటు బెస్ట్ వెబ్ సిరీస్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్(వెబ్ సిిరీస్), బెస్ట్ మేల్ యాక్టర్(వెబ్ సిరీస్) జాబితాను కూడా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఆగస్టు 14న ప్రకటించనున్నారు. ఈ వేడుకను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఆగస్టు 14 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Tags : 1