Breaking News

ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది: నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్

Published on Mon, 07/01/2024 - 20:12

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి రోజు నుంచే సూపర్‌ హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడినట్లు నాగ్ అశ్విన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం.

నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో రాస్తూ..' దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం(నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌) కలిసి మా తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం" ప్రారంభించాం . అప్పట్లో వైజయంతి నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకున్నది . నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఒక రోజు వర్షం కురిసింది. దీంతో  షూటింగ్ పూర్తి చేయలేకపోయాం. దీంతో మళ్లీ షూటింగ్‌ సెట్ వేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ ఖర్చు ఎక్కువైంది. అది కాస్తా  మమ్మల్ని భయాందోళనకు గురిచేసిందని. ' రాసుకొచ్చారు. 

'అంతే కాకుండా.. దాదాపు 10 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తున్నా. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)