Breaking News

కొత్త పాయింట్‌తో తీశారనిపిస్తోంది 

Published on Sat, 03/02/2024 - 06:02

విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో..’. రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో డా. కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి. మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘కలియుగం పట్టణంలో..’ టైటిల్‌ కొత్తగా ఉంది. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. నా ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు.

ఇప్పుడు హీరోగా నటించాడు. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేయాలి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఓ రోల్‌ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘మదర్‌ సెంటిమెంట్, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ను మిక్స్‌ చేసి ఈ సినిమా తీశారు. చిత్రా శుక్లా ఓ స్పెషల్‌ రోల్‌ చేశారు’’ అన్నారు విశ్వ కార్తీకేయ. ‘‘మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమాకాంత్‌ రెడ్డి. ‘‘మా టీజర్, ట్రైలర్‌ను చూసి కథను అంచనా వేయలేరు. సినిమా అంత కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణను కడపలోనే చేశాం’’ అన్నారు కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి. ‘‘సినిమా అంతా కడపలోనే తీయడం ఇదే తొలిసారి. కడప నుంచి ఓ మంచి నిర్మాత రాబోతున్నాడు’’ అన్నారు దర్శకుడు నీలకంఠ.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)