Breaking News

రైతుల్ని ఉగ్రవాదులు అంటావా? కాజల్ కొత్త సినిమా ట్రైలర్

Published on Sat, 07/18/2026 - 16:54

ఒకప్పటితో పోలిస్తే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాదు కాదు కొందరు వ్యాపారాలు చేసేస్తున్నారు. దీని వల్ల యువతరం, చిన్న పిల్లలు.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఈ సంగతులన్నీ జనాలకు తెలుసు. రోజూ పేపర్, టీవీ, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'ద ఇండియా స్టోరీ'. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించారు. వచ్చే శుక్రవారం(జూలై 24) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

దేశ సరిహద్దుల్లో సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఏడేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోతుంది. అయితే తన కుమార్తెని అన్యాయంగా చంపేశారని చెప్పి సదరు తండ్రి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఓ లాయర్‌తో కలిసి క్రిమి సంహారకాలు తయారు చేసే కంపెనీలు, కల్తీ చేసే సంస్థలపై పోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఓ మహిళా లాయర్‌తో కలిసి ఏం చేశాడు? రైతులు వీళ్లిద్దరిపై ఎందుకు తిరగబడ్డారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇందులో చూపించినవన్నీ చేదు నిజాలే. జనాలకు కూడా ఇలాంటి కల్తీ, క్రిమి సంహారక మందుల గురించి తెలుసు. అయినా సరే వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇవి తింటున్న పరిస్థితి. ఇవి కాకుండా మూవీలో ఇంకేం చూపిస్తారో చూడాలి? ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై ఏ మాత్రం బజ్ లేదు.

(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రీతి ముకుందన్.. శ్రీనివాస రామానుజన్ ముని మనవరాలా?)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి