Breaking News

బరువు తగ్గిన కాజల్‌.. మెచ్చుకున్న వారిపై ఫైర్‌

Published on Wed, 08/27/2025 - 07:20

నిజాలు చేదుగా ఉంటాయన్న సామెత ఉండనే ఉంది. అలా కొందరు వాస్తవాలను అంగీకరించలేరు కదా ప్రశంసలను కూడా స్వాగతించలేరు. నటి కాజల్‌ అగర్వాల్‌ ప్రవర్తన కూడా ఇలానే ఉంది. ఈ భామ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందిన విషయం తెలిసిందే. కొన్ని ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథా పాత్రలో నటించినా పెద్దగా ఫలితం దక్కలేదు. అదే సమయంలో మార్కెట్‌ కూడా పడిపోయింది. దీంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అలా 2020లో 'గౌతమ్‌ కిచ్లూ' అనే వ్యక్తిని వివాహమాడారు. వీరికి 'నీల్‌ కిచ్లూ' అనే కొడుకు ఉన్నాడు. పెళ్లి తర్వాత కొద్ది కాలమే నటనను కొనసాగించిన కాజల్‌ అగర్వాల్‌కు సరైన హిట్స్‌ అవకాశాలు రాకపోవడంతో ఖాళీగానే ఉన్నారు. 

అదే సమయంలో కాస్త బరువు కూడా పెరిగారు. ఈమెకు కథానాయిక అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాజల్‌ అగర్వాల్‌ కమలహాసన్‌తో కలిసి నటించిన ఇండియన్‌ – 3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 40 ఏళ్ల ఈ పరువాల భామ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అందుకోసం గట్టిగా కసరత్తు చేసి, బరువు తగ్గి అందంగా తయారయ్యారు. దీంతో పలువురు నాలుగు పదులు వయసు దాటినా మళ్లీ సినిమాలో నటించడానికి సిద్ధమైన కాజల్‌ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక్కడే ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం విశేషం. ఆమె రీఎంట్రీకి అందుతున్న శుభాకాంక్షలకు సంతోషపడకుండా 40 అని తన వయసును ప్రస్తావించడం జీర్ణించుకోలేకుంది. దీంతో 40 ఏళ్లు నిండితే అంతా ముగిసిపోయిందని అర్థం కాదనీ, అయినా ప్రతిభకు వయసు ఆటంకం కాదనీ, ఇకపై వయసు గురించి ఎవరు మాట్లాడవద్దు అని నటి కాజల్‌ అగర్వాల్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిజాలను అంగీకరించడానికి కాజల్‌ అగర్వాల్‌ ఎందుకింత అసహనం అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)