Breaking News

సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు

Published on Mon, 04/21/2025 - 07:13

తమిళ నటుడు కాదల్‌ సుకుమార్‌ కోలీవుడ్‌లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించాడు.  శింబు కాదల్‌ వావ్తిల్లై (కుర్రాడొచ్చాడు), కమల్‌ హాసన్‌ విరుమాండి(పోతురాజు) వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుని ఛాన్సులు అందుకున్నాడు. బాలాజీ శక్తివేల్‌ దర్శకత్వం వహించిన కాదల్‌ (ప్రేమిస్తే) చిత్రంలో అతని నటనకు ప్రశంసలు లభించినందున అతన్ని కాదల్‌ సుకుమార్‌ అని పిలుస్తారు. ప్రస్తుతం తిరుట్టు విశీల్‌, షుమ్మవే ఆడువోమ్‌ అనే 2 చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌లు కూడా ఆర్ధాంతరంగానే ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాల్లో నటించే ఛాన్స్‌లతో పాటు కొత్తగా దర్శకత్వం వహించడానికి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. 

కాదల్‌ సుకుమార్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గత జనవరిలో చైన్నె టీనగర్‌ ఆల్‌ ఉమెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై ఒక నటి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు కాదల్‌ సుకుమార్‌ తనను పెళ్లి చేసుకుంటానని, 3 సంవత్సరాలు కుటుంబాన్ని పోషిస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 7 లక్షలు డబ్బుతో పాటు నగలు తీసుకుని మోసం చేశాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సుకుమార్‌పై కేసు నమోదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలని అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. 

కాదల్‌ (ప్రేమిస్తే) సినిమా తెలుగులో కూడా విడుదలైంది. దీనిని దర్శకుడు శంకర్‌ తన బ్యానర్‌పై తక్కవ బడ్జెట్‌తో నిర్మించారు. భరత్‌, సంధ్యలకు పెళ్లి జరిపించిన స్టీఫెన్‌ పాత్రలో సుకుమార్‌  కనిపిస్తాడు. ఈ పాత్రతో అతనికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా అతను సుపరిచయమేనని చెప్పవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)