Breaking News

ఆర్థిక కష్టాలతో రోడ్డెక్కిన కచ్చాబాదం సింగర్‌కు బుల్లితెరపై ఛాన్స్‌!

Published on Mon, 04/03/2023 - 15:49

ఒక్కరోజులో వచ్చే స్టార్‌డమ్‌ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. సోషల్‌ మీడియా పుణ్యమా అని చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోతున్నారు. కానీ దాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. అందుకు కచ్చా బాదం సింగర్‌ భూబన్‌ బద్యాకర్‌ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్‌ కచ్చా బాదమ్‌ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ పాట సోషల్‌ మీడియాలో క్లిక్‌ కావడంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు. పాటలు, ప్రదర్శనలతో బోలెడంత డబ్బు రావడంతో కారు కూడా కొనుక్కున్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మరోవైపు అడిగినవారికల్లా అప్పులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడే కానీ దాన్ని తిరిగి వసూలు చేయలేకపోయాడు.

చివరికి ఉన్నదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. తనకు లోకజ్ఞానం లేకపోవడంతో ఓ కంపెనీ మూడు లక్షలివ్వగానే వాళ్లు చూపించిన పత్రాల మీద సంతకం పెట్టాడు. దీంతో అతడు కచ్చా బాదమ్‌ పాట మాత్రమే కాదు ఏ పాట యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసినా కాపీరైట్‌ ఇష్యూ వస్తోంది. 

ఇన్ని మోసాలు, కష్టాల తర్వాత అద్దె ఇంట్లో బతుకు వెల్లదీస్తున్న భూబన్‌ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఓ బెంగాలీ సీరియల్‌లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తైందట. ఒక్క పాత్రతోనే రూ.40 వేల దాకా సంపాదించిన అతడు మున్ముందు కూడా మంచి అవకాశాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానంటున్నాడు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)