Breaking News

'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే

Published on Mon, 02/03/2025 - 14:13

సౌత్‌ ఇండియా ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి (కే.పీ చౌదరి) ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, గతేడాదిలో డ్రగ్స్‌ కేసులో సైబరాబాద్‌ పోలీసులు  ఆయన్ను పట్టుకున్నారు. దీంతో చిత్ర పరిశ్రమలో కూడా తీవ్రమైన అలజడి నెలకొంది. ఆ సమయంలో టాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు.  తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు.

డ్రగ్స్  కేసులో అరెస్ట్ అయిన కే.పీ చౌదరి  తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడని, అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. మూడున్నరేళ్ల పాటు సినీమా రంగంలో ఉన్నాడు. ఇందులో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఆయన ఎంచుకున్నారు. గోవాలో ఓహెచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేశారు.

అయితే, పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా గతంలో పోలీసులు తెలిపారు. బీటెక్‌ చదివిన చౌదరి గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నాయి. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)