Breaking News

'ఐదు జంటల లవ్‌ స్టోరీ'.. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన డైరెక్టర్‌ తనయుడు!

Published on Thu, 08/08/2024 - 20:16

ఎంఎన్‌వీ సాగర్, శృతి శంకర్ జంటగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం' కాలం రాసిన కథలు'. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. యస్ యమ్ 4 ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్‌ జగన్నాధ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా  మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎంఎన్వీ సాగర్ మాట్లాడుతూ..' నా గురువుగా భావించే డైరెక్టర్  పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రాబోతున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీసుకొస్తున్నాం. 30 ఏళ్ల క్రితం మొదలైన పరువు హత్యల మధ్యే ఈ కథ సాగుతుంది. ఈ చిత్రం ద్వారా కొంతమంది కొత్తవారు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు ఉన్నాయి' అని అన్నారు. ఈ  చిత్రంలో  వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)