Breaking News

ఓటీటీలో 'కె- ర్యాంప్‌'.. అధికారిక ప్రకటన

Published on Sat, 11/08/2025 - 12:21

టాలీవుడ్‌ నటుడు కిరణ్‌ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’ (KRamp) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  దీపావళి పండుగ కానుక‌గా విడుద‌లైన  ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజయం అందుకుంది. ఇందులో యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు నటించారు. తొలిసారిగా డైరెక్టర్‌గా ఛాన్స్‌ దక్కించుకున్న జైన్స్ నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు.

'బుర్రపాడు ఎంటర్‌టైనర్‌' అంటూ  'కె- ర్యాంప్‌' పోస్టర్‌ను ఆహా (Aha) తెలుగు ఒక పోస్టర్‌ విడుదల చేసింది. నవంబర్‌ 15న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రాజశేఖర్‌ నటించిన ఆయుధం సినిమాలోని 'ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా.. ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను.. ఏకం కమ్మందా' అనే సాంగ్‌ను కె ర్యాంప్‌లో రీక్రియేట్‌ చేసి మెప్పించారు. ఈ ఏడాదిలో షోషల్‌మీడియాను షేక్‌ చేసేలా చాలామంది రీల్స్‌ చేశారు. గ‌తేడాది దీపావ‌ళికి ‘క’ సినిమాతో హిట్‌ అందుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం... ఈ దీపావ‌ళికి ‘కె - ర్యాంప్‌’తో  మరో విజయాన్ని దక్కించుకున్నారు.

కథేంటి
కుమార్‌ అబ్బవరం(కిరణ్‌ అబ్బవరం) రిచ్‌ కిడ్‌. ఎంసెంట్‌ ఫెయిల్‌ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్‌) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్‌ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్న కుమార్‌.. తొలి చూపులోనే క్లాస్‌మేట్‌ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు.

మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది.  ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.  అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది.  ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్‌ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)