Breaking News

హీరోయిన్ గా 'గుప్పెడంత మనసు' జగతి.. గ్లింప్స్ రిలీజ్

Published on Wed, 04/30/2025 - 13:02

తెలుగులో 2020-24 మధ్య 'గుప్పెడంత మనసు' అనే సీరియల్ ప్రసారమైంది గుర్తుందా? ఇందులో జగతి మేడమ్ గా నటించి, ఆకట్టుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈమె చేసిన తెలుగు సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: 'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు)   

గతంలో కన్నడలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఒకటి రెండు మూవీస్ తెలుగులోనే చేస్తోంది. అందులో ఒకటే కిల్లర్. తాజాగా ఈ చిత్ర టీజర్ నే విడుదల చేశారు.

వైమానిక శాస్త్రం అని కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. ఇందులో జ్యోతి రాయ్ గ్లామరస్ గా కనిపించింది. అదే టైంలో రోబో తరహా పాత్ర కూడా చేయడం విశేషం. త్వరలో రిలీజ్ సహా ఇతర వివరాలు వెల్లడిస్తారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో.. ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

(ఇదీ చదవండి: పవన్‌ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్‌మెంట్‌!)    

డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్.. పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో చూపించారు. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ స్టన్నింగ్ యాక్షన్ చేసింది. 

మరి ఈ సినిమాకు ముందు మొదలైందో, తర్వాత మొదలైందో గానీ కిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించిన పూర్వజ్ తో జ్యోతి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తన పేరు చివర పూర్వజ్ అని మార్పు చేసుకుంది. గతంలో ఈమెకు పెళ్లవగా ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఏదేమైనా సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమా హీరోయిన్ కావడం అంటే విశేషమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)