Breaking News

'వైరల్‌ వయ్యారి' కొరియోగ్రాఫర్‌ మన మణుగూరు బిడ్డనే..

Published on Sat, 07/19/2025 - 14:04

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సోషల్మీడియాలో 'వైరల్వయ్యారి' అంటూ 'జూనియర్‌' సినిమా సాంగ్ట్రెండ్అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే సౌండ్వినిపిస్తుంది. అయితే, పాటకు హీరో కిరీటి, శ్రీలీల పోటీపడి డ్యాన్స్చేశారు. పాట మొత్తం ఫుల్ఎనర్జీతో స్టెప్పులు వేశారు. అయితే, పాటకు కొరియోగ్రఫీ చేసిన కుర్రోడు ఎవరు..? అని సోషల్మీడియాలో వెతుకుతున్నారు. పాటకు స్టెప్పులు వేయించింది తెలంగాణ బిడ్డే.. మణుగూరుకు చెందిన రేవంత్‌ మాస్టర్‌ సాంగ్కు కొరియోగ్రాఫర్గా పనిచేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన రేవంత్‌ పూలమార్కెట్‌ ప్రాంతంలో ఉంటాడు. తన అమ్మగారు సుభద్ర పూలదుకాణం నడుపుతున్నారు. భర్తను కోల్పోయిన ఆమె పట్టుదలతో ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను ఉన్నంతలో చదివించారు. వారిలో చిన్నవాడైన రేవంత్కు డ్యాన్స్అంటే పిచ్చి. దీంతో పదో తరగతి పూర్తి అయిన తర్వాత 2013లో హైదరాబాద్కు షిఫ్ట్అయ్యాడు. అక్కడ చిన్నచిన్న ఈవెంట్లు చేశాడు. తండ్రి మరణం తర్వాత ఇబ్బందులు వచ్చినా తన అమ్మగారు పూలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించింది. రేవంత్కూడా హైదరాబాద్లో పనిచేస్తూ.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరి డ్యాన్స్‌లో శిక్షణ పొందాడు. అక్కడి నుంచి అతని ప్రయాణం మరో అడుగు ముందుకు పడింది.

సైడ్‌ డ్యాన్సర్‌గా పనిచేసిన రేవంత్‌.. ఢీ 9వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా మెప్పించాడు. తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఢీ 15వ సీజన్‌లో రెండో ఫైనలిస్ట్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో శేఖర్మాస్టర్ఛాన్స్ఇచ్చాడు. ఆయన పర్యవేక్షణలో ఆచార్య సినిమాలోని 'భలే బంజారా' పాటకు పనిచేశాడు. అలా సుమారు వందకు పైగా పాటలకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా రేవంత్పనిచేయడం విశేషం. తన టాలెంట్ను గుర్తించిన జూనియర్సినిమా మేకర్స్ఏకంగా రెండు పాటలకు ఛాన్స్ఇచ్చారు. వైరల్‌ వయ్యారి సాంగ్తో పాటు టైటిల్‌ సాంగ్‌కు కూడా రేవంత్కోరియోగ్రఫీ ఇచ్చాడు. తన విజయానికి తన అమ్మగారు ఎంత కష్టపడ్డారని ఆయన తెలిపాడు. ఆపై శేఖర్‌ మాస్టర్‌ నేర్పించిన మెలకువలు తన జీవితాన్ని మార్చేశాయని పేర్కొన్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)