Breaking News

ఆయనతో పదేపదే కిస్‌ సీన్‌ చేయనన్న హీరోయిన్‌

Published on Sun, 11/30/2025 - 14:47

షారూఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, సన్నీ డియోల్‌ వంటి హీరోలతో ఎక్కువగా జోడీ కట్టింది జూహీ చావ్లా. అలా సన్నీ డియోల్‌తో లూటెరే అనే హిట్‌ సినిమాలోనూ యాక్ట్‌ చేసింది. ఆ విశేషాల గురించి నిర్మాత సునీల్‌ దర్శన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'జూహీ కెరీర్‌లో ముఖ్య పాత్ర పోషించిన సినిమాల్లో లూటెరె ఒకటి. 

 దివ్య భారతిని కాదని..
ఆమె నటించిన సుల్తానాత్‌ (1986), ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌ (1988) సినిమలను నేనే డిస్ట్రిబ్యూట్‌ చేశాను. తను చాలా బాగా యాక్ట్‌ చేయగలదు. అందుకే లూటెరె మూవీలో తనను హీరోయిన్‌గా తీసుకున్నాం. నిజానికి దివ్య భారతి అప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. తను ఈ సినిమాలో భాగం కావాలని కోరుకుంది. కానీ, ఆమె ఈ పాత్రకు సరిపోదని భావించాం. దర్శకుడు ధర్మేశ్‌, నేను.. తనను కాదని జూహీ చావ్లాను తీసుకున్నాం.

గ్లామర్‌గా చూపించాం
అయితే ఈ సినిమాలో మే తేరీ రాణి తు రాజా అని ఓ బీచ్‌ సాంగ్‌ ఉంటుంది. అందులో ఆమె బీచ్‌లో షర్ట్‌ ధరించి నీళ్లలో తడవాల్సి ఉంటుంది. అప్పటిదాకా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌తో ఉన్న జూహీ చావ్లా.. సడన్‌గా గ్లామర్‌గా కనిపించాలంటే కొంత భయపడింది. కానీ కథ మొత్తం చెప్పాకే తను సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కాబట్టి చేయక తప్పలేదు. 

ముద్దు సన్నివేశం
అలాగే హీరోతో ముద్దు సన్నివేశం ఉంటుందని కూడా చెప్పాం. అలా మొదట్లో సీన్‌ షూట్‌ చేశాం. అయితే ఔట్‌డౌర్‌లో ఆ సీన్‌ తీస్తే బాగుంటుందనుకున్నాం. అంతా సిద్ధం చేసుకున్నాక జూహీ రాలేదు. తనకు వేరే షూటింగ్‌ ఉందని సాకు చెప్పి తప్పించుకుంది. సినిమాకు ఆ సన్నివేశం కీలకమని, ఏదో సంచలనం కోసం దాన్ని షూట్‌ చేయట్లేదని దర్శకుడు అన్నాడు.

రీటేక్‌కు ఒప్పుకోలేదు
అలా సన్నీ డియోల్‌ , జూహి (Juhi Chawla)తో ముద్దు సీన్‌ తీశారు. అప్పటికీ అది సరిగా రాలేదని రీటేక్‌ చేయాలన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జూహి.. కాంట్రాక్ట్‌లో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటిస్తానని చెప్పాను. అది ఆల్‌రెడీ చేశానుగా అని వాదించింది. అందుకని ఆమెను బలవంతం చేయకుండా ఫస్ట్‌ తీసిన సీన్‌ను అలాగే ఉంచాం. ఆ సినిమా జూహీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది' అని సునీల్‌ దర్శన్‌ (Suneel Darshan) చెప్పుకొచ్చాడు.

చదవండి: కాంతార దైవాన్ని దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్‌ స్టార్‌

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)