Breaking News

జూనియర్ ఎన్టీఆర్‌- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?

Published on Tue, 07/25/2023 - 19:09

టాలీవుడ్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఏకంగా ‍గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. 

అయితే తాజాగా ఎన్టీఆర్‌ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. జూనియర్‌ 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకున్నారు. మే 5వతేదీన 2011లో జరిగిన వీరి వివాహాం అత్యంత వైభవంగా జరిగింది. కాగా.. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్‌ రామ్‌ అనే కుమారులు జన్మించారు.

(ఇది చదవండి: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!)

అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి  పెళ్లిలో కట్టుకున్న చీరపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఆమె ధరించిన బంగారు వర్ణం గల చీర ధర దాదాపు  కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా ఎన్టీఆర్‌ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

పెళ్లి చీర ప్రత్యేకతలు

ఎన్టీఆర్‌ భార్ ప్రణతి ధరించిన అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ధరించింది. లక్ష్మీ ప్రణతి కంజీవరం చీరలో స్వచ్చమైన బంగారం, వెండితో నేసినట్లుగా సమాచారం. ఆమె చీరకు తగినట్లుగానే బంగారు, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్‌ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించింది. జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కుర్తా, ధోతీతో మెరిసిపోయారు. 

అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కళ్యాణ మండపం విలువ రూ. 18 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో 3 వేల మంది అతిథులు, దాదాపు 12,000 మంది అభిమానులు హాజరయ్యారు. కాగా.. ఈ జంటకు 2014లో తమ మొదట అభయ్ రామ్‌ జన్మించగా.. 2019లో భార్గవరామ్‌ను స్వాగతించారు. ఈ ఏడాది మార్చిలో ప్రణతి తన 30 బర్త్‌డేను కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్‌. 

(ఇది చదవండి: ఆ సీన్‌లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్‌ నటుడు షాకింగ్ కామెంట‍్స్!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)