Breaking News

నా లోకమే నా మైమరపు

Published on Tue, 08/06/2024 - 03:42

దేవరపై తన ప్రేమనంతా పాట రూపంలో చూపించేసింది తంగమ్‌. ‘చుట్టమల్లె చుట్టేస్తావె తుంటరి చూపు... ఊరికే ఉండదు కాసేపు... అస్తమానం నీ లోకమే నా మైమరపు... చేతనైతే నువ్వే నన్నాపు...’ అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది. దేవరగా ఎన్టీఆర్, తంగమ్‌గా జాన్వీ కపూర్‌ నటిస్తున్న ‘దేవర’ చిత్రంలోని పాట ఇది. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తొలి భాగం సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ ఆరంభించి, ఒక్కో పాట విడుదల చేస్తున్నారు. సోమవారం ‘చుట్టమల్లె చుట్టేస్తావె...’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్‌ చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరచిన ఈ రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించగా శిల్పా రావ్‌ పాడారు. బాస్కో మార్టిస్‌ కొరియోగ్రఫీ చేశారు.హై యాక్షన్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘దేవర’ చిత్రానికి కెమెరా: ఆర్‌. రత్నవేలు.

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)