Breaking News

ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి

Published on Tue, 12/24/2024 - 19:22

జూనియర్ ఎన్టీఆర్ సాయం చేస్తానని మాట తప్పారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ బాబు ఆస్పత్రి చికిత్స కోసం ఆర్థికసాయం చేయలేదంటూ మహిళ మాట్లాడిన వీడియో నెట్టింట వైరలైంది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ ఆరోగ్యంపై ఎన్టీఆర్ టీమ్ ఆరా తీసింది.

క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌ను ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు ఎన్టీఆర్ టీమ్.. అంతేకాదు అతని చికిత్సకు అయిన ఖర్చును మొత్తం చెల్లించారు. దీంతో తమను ఆదుకున్న ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా కౌశిక్ తల్లి ధన్యవాదాలు తెలిపింది.

(ఇది చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)

థాంక్యూ ఎన్టీఆర్ సార్.. కౌశిక్ తల్లి

అయితే తాను ఎన్టీఆర్ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆమె తెలిపింది. నా మాటలను తప్పుగా ‍అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నా కుమారుడు కౌశిక్ ఆనందంగా, సంతోషంగా ఉన్నాడని పేర్కొంది.  ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళుతున్నామని ఆమె వెల్లడించింది. మా కుటుంబం అంతా ఎన్టీఆర్‌కు అభిమానులు అని.. నాకు అన్ని విధాల సహకరించిన ఎన్టీఆర్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)