Breaking News

'దావూది సాంగ్‌ ఎందుకు పెట్టలేదంటే'.. అసలు కారణం చెప్పేసిన ఎన్టీఆర్

Published on Sun, 10/06/2024 - 08:04

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో టీమ్ అంతా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

తాజాగా డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్.. యాంకర్ సుమతో ఇంటర్వ్యూరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్‌ జర్నీ ఆఫ్‌ దేవర’ పేరుతో ఎన్టీఆర్‌, కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవరలోని దావూది సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ వర్షన్‌లో దావూది సాంగ్‌ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చారు.

'ఒక పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్‌ అనుమతులు తప్పనిసరి. మనం ఇష్టం వచ్చినట్లు యాడ్‌ చేయలేం. ఐదు భాషల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. దావూది పాట తీసేయడానికి మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. మీరు సినిమా చూస్తు ఉంటే కథ సీరియస్‌గా మొదలైపోయింది. ఆ సమయంలో సాంగ్ పెడితే బ్రేక్‌లా అనిపించింది. కథను చెప్పేటప్పుడు మనం బ్రేక్ ఇవ్వకూడదు. కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం. అక్కడ దావుది సాంగ్ పెడితే బ్రేక్‌ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సినిమా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయాలని నిర్ణయించాం' అని అన్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)