Breaking News

దట్ ఈజ్‌ జూనియర్ ఎన్టీఆర్‌.. రికార్డ్‌ ధరకు అమ్ముడైన ఫోటో!

Published on Thu, 09/04/2025 - 16:22

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌కు డై హార్డ్‌ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, వార్-2 చిత్రాలతో జూనియర్‌ వరల్డ్‌ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు.. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్‌ ఉందని అర్థమైంది. బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌ ఫోటోను తన టాలెంట్‌తో ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్‌కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్‌ ఆర్ట్‌కు ఏకంగా రూ.1,45,300 రూపాయలు అమ్ముడైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్‌ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది.

ఎన్టీఆర్ ఆర్డ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది. ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్‌ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్‌తో ఎన్టీఆర్‌ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)