Breaking News

వార్‌-2లో జూనియర్ ఎన్టీఆర్.. ఎంట్రీతోనే రికార్డ్ రెమ్యునరేషన్‌!

Published on Sat, 04/08/2023 - 14:41

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ దక్కడంతో యంగ్ టైగర్ గ్లోబర్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు. దీంతో ఎన్టీఆర్‌ రాబోయే చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్30 చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. అలాగే బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు.

బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ నటిస్తోన్న వార్‌ -2లో తారక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఈ సినిమాపై అటూ బి-టౌన్‌లోనూ.. ఇటూ టాలీవుడ్‌లోనూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే వార్‌- 2కు తారక్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.40 నుంచి రూ.50 వరకు కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్‌ వార్‌- 2 కోసం ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ రూ.45 కోట్ల పారితోషికం అందుకున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటికే దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అల్లు అర్జున్, దళపతి విజయ్, అజిత్ కుమార్ లాంటి హీరోలు ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్లకు పైగానే ఫీజు వసూలు చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం వార్- 2 మూవీతో  వంద కోట్ల క్లబ్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.   
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)