Breaking News

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

Published on Tue, 05/23/2023 - 20:35

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్‌కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్‌ బ్యానర్లపై చిందించారు.

(ఇది చదవండి: షాకింగ్‌.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌)

ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్‌సన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్‌లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో జతకట్టనున్నారు. 

(ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్‌.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)